Airport Closed: ప్రతి ఏడాది ఆ రోజు అంతర్జాతీయ విమానాశ్రయం 5 గంటలపాటు మూసేయలట.. కారణం తెలిస్తే షాక్..

Big Alert To Airport Passengers: విమానాలు అంతర్జాతీయ, జాతీయ మార్గంలో నిరంతరం ప్రయాణం చేస్తాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం బంద్‌ ఉంటాయి. అందులో ముఖ్యంగా వాతావరణం అనుకూలించకపోవడం లేదా సర్వర్‌ డౌన్‌ అవ్వడం ప్రధాన కారణం. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం నవంబర్‌ 9న బంద్‌ ఉంటుంది. కారణం తెలుసా?

Written by - Renuka Godugu | Last Updated : Nov 5, 2024, 05:04 PM IST
Airport Closed: ప్రతి ఏడాది ఆ రోజు అంతర్జాతీయ విమానాశ్రయం 5 గంటలపాటు మూసేయలట.. కారణం తెలిస్తే షాక్..

Big Alert To Airport Passengers: విమాన ప్రయాణం చేయాలంటే కచ్చితంగా విమానాశ్రయం వెళ్లాల్సిందే. ఇవి నిరంతరం 365 రోజులు ప్రయాణిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ సేవలు ప్రయాణీకులకు అందిస్తాయి. అయితే, ఏడాదికి ఓ రెండు రోజులు మాత్రం కచ్చితంగా 5 గంటలపాటు విమాన సేవలు బంద్‌ చేయాలట. దీనికి ప్రధాన కారణం ఉంది. ఈ ఏడాది కూడా  నవంబర్‌ 9న మాత్రం ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టకు 5 గంటలపాటు బంద్‌ ఉంటుందట. కారణం తెలుసుకుందాం.

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (TIAL)లో ఈ నెల 9వ తేదీనా ఓ 5 గంటలపాటు మూసివేయనున్నారు. ఎందుకంటే 'అల్పాసీ అరట్టు' అనే కేరళ రాష్ట్రంలోని  శ్రీ పద్మనాధస్వామి ఆలయంలో వేడుకలు వైభవంగా నిర్వహిస్తారట. ఇది ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తారు. ఆరోజు విష్ణుమూర్తి కోసం ప్రత్యేకంగా మూసేస్తారు. దీనికి ప్రధాన కారణం ఉంది. అది ఏంటో తెలుసుకుందాం.

అయితే, ప్రతి ఏడాదిలో రెండు రోజులు వేడుక నిర్వహిస్తారు. అల్పాసీ అరట్టు అంటే స్వామివారి విగ్రహాన్ని దగ్గరలో ఉన్న శంఖు ముఖ సముద్రంలో స్నానానికి తీసుకు వెళ్తారు. ఆ మార్గం ఎయిర్‌పోర్టు రన్‌వే గుండా వెళ్తుందట. ఆ మార్గం గుండానే స్వామివారి విగ్రహాన్ని తీసుకువ వెళ్తారు. దీనివల్ల ఆ రెండు రోజులపాటు ఎయిర్‌ పోర్టు సేవలను  మూసివేస్తారు. 

ఇదీ చదవండి: ఈ 3 ఇంటి చిట్కాలతోనే తెల్ల వెంట్రుకల సమస్యకు ఈజీగా చెక్‌ పెట్టొచ్చు తెలుసా?

ఈ పవిత్ర స్నానం స్వామి వారికి ఆచారం ప్రకారం నిర్వహిస్తారు. ఇది గత వందల సంవత్సరాలు వస్తోన్న సమాచారం. తిరువనంతపురం ఎయిర్‌పోర్టును 1932 లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వేడుక సమయంలో పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని 'అరట్టు' ఎయిర్‌ పోర్టు రూట్‌ గుండా తీసుకువెళ్తారు. ఇది సంప్రదాయంగా వస్తోంది.

ఏడాదికి రెండు సార్లు ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. శంఖు ముఖ సముద్రంలో స్వామివారికి స్నానం చేయిస్తారు. ఇది తిరువనంతపురం ఎయిర్‌ పోర్టు వెనుక భాగంలో ఉంటుంది. ఏడాదిలో మొదటి పవిత్ర స్నానం మార్చి, ఏప్రిల్‌  ఫాల్గుణ మాసంలో నిర్వహిస్తారు. రెండోది ఆశ్వీయుజ మాసంలో అక్టోబర్‌ లేదా నవంబర్‌ మాసంలో నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:  బీటా కెరొటిన్‌కు పవర్‌హౌజ్‌.. ఈ ఆరెంజ్‌ రంగు కాయతో ఎన్నో బెనిఫిట్స్‌..

చరిత్ర ప్రకారం ట్రావెన్‌కోర్‌ రాజు శ్రీ చిత్తిర తిరునాల్‌ ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇది 363 రోజులు ప్రజలకు కోసం అందుబాటులో ఉంటుంది. కానీ, ఏడాదిలో రెండు రోజులు మాత్రం పద్మనాభ స్వామి కోసం అని చెప్పారట. ప్రధానంగా ఈ సముద్రానికి చేరుకోవడానికి విమాన రన్‌వే గుండా వైభవంగా, శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహాన్ని స్నానానికి తీసుకువెళ్తారట. అంటే నవంబర్‌ 9వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలను నిలిపివేయనున్నారు.  ఈ కారణంగా ఎయిర్‌ పోర్టు అధికారులు విమాన ప్రయాణ షెడ్యూల్ ను కూడా రీషెడ్యూల్‌ చేస్తారట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News